Monday, 30 July 2012
సోమవారం 30 జూలై 2012
పద్య రచన - 66
కరుణ,కర్కశత్వములెల్లగానపఱచి
శునక హావభావంబులఁజూచినేర్చె
నటన, యస్విరంగారావునటుడు తానె!
Sunday, 29 July 2012
ఆదివారం 29 జూలై 2012
పద్య రచన - 65
ప్రేమారగఁ గౌగిలించవేడిన వారే!
భామామణులై కృష్ణుని
తామెల్లరుఁగౌగిలించి ధన్యులుఁగారే?
నిచ్ఛలఁదీర్చంగవాడు .నింతులఁగూడన్
సచ్చరితుఁభక్తవరదుని
వెచ్చనికౌగిలిదొరకగ వేడెదమదిలో!
నిచ్ఛలఁదీర్చంగవాడు .నింతులఁగూడన్
సచ్చరితుఁభక్తవరదుని
వెచ్చనికౌగిలిదొరకగ వేడెదమదిలో!
శనివారం 28 జూలై 2012
సమస్యాపూరణం - 776 (పాండవులకు శ్రీకృష్ణుఁడు)
పాండవులపక్షపాతిగ పరగు చుండ
కౌరవులు కీడుఁదలపెట్ట క్రూరముగను
పాండవులకు, శ్రీకృష్ణుడు వైరి యగును
శుక్రవారం 27 జూలై 2012
సమస్యాపూరణం - 775 (వరలక్ష్మీవ్రతముఁ జేయ)
వరముల బడయంగలేరు! వాక్కిది వినుమా!
వరములఁ బొంద నయోగ్యులు
వరలక్ష్మీవ్రతముఁజేయవలదంద్రు బుధుల్!
గురువారం 26 జూలై 2012
సమస్యాపూరణం - 774 (కాకరపూ పూచి నిమ్మ)
కాకర, పూపూచి నిమ్మ, కాయలు కాచెన్
కాకర కీటక నాశిని
గాకున్న పెరటి నిమ్మ,కాసులొసగునే?
(పెరటి నిమ్మ చెట్లు ఇంటి అవసరములకు మించి కాయల నీయగా, అమ్మితే డబ్బులొచ్చాయన్న భావం)
బుధవారం 25 జూలై 2012
సమస్యాపూరణం - 773 (విషము సేవింప నాయువు)
హరిని మరువక ప్రహ్లాద!తిరిగినంత
కాలకూటవిషమునీకుమేలనంగ
తండ్రియానతి పాటించి దలచి హరిని
విషముసేవింపనాయువు పెరుగు నయ్య!
Tuesday, 24 July 2012
Monday, 23 July 2012
ఆదివారం 22 జూలై 2012
పద్య రచన - 58
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.
నింగి హరివింటి నారిని నేను మీటి
సప్త సుస్వర నాధమ్ము జాలువార
వినగ భూతలమ్మంతయు వెదకి జూడ
నారి కనరాదె? దాటిన నాల్గు పదులు!
Saturday, 21 July 2012
"సమస్యాపూరణం -765 (భాష రానివాఁడె)"(17-7-2012)
తనదు రంగ మందు ‘తా నేర్పుతోడను
నేర్చుకొన్నవిషయనిర్వచనము
పదుగుఱెదుటనర్థవంతమైబల్కుదు
ర్భాషరానిఁవాడె పండితుండు!
Monday, 16 July 2012
Saturday, 14 July 2012
అడుగడుగు దండముల వా
డిడుగిడుగోయేడుకొండలేలెడిఱేడున్
వడివడిగబడుగులనుఁగా
చెడువానింగొలువ సిరులుచేకుఱుమనకున్!
డిడుగిడుగోయేడుకొండలేలెడిఱేడున్
వడివడిగబడుగులనుఁగా
చెడువానింగొలువ సిరులుచేకుఱుమనకున్!
సమస్యాపూరణం -763 (కోటి కంటె యొకటి) (15/7/12)
ఒకటి నాని యేడు నొట్టి సున్నాలున్న
కోటి యౌను విలువ మేటి గాను
ఒకటి లేని కోటి యొట్టి సున్నే యైన
కోటి కంటె యొకటి మేటి గాదె !
ఒకటి నాని యేడు నొట్టి సున్నాలున్న
కోటి యౌను విలువ మేటి గాను
ఒకటి లేని కోటి యొట్టి సున్నే యైన
కోటి కంటె యొకటి మేటి గాదె !
Friday, 13 July 2012
పిండాల బావి గూర్చిన కవిత నొక పుస్తకావిష్కరణ సభలోవిన్నట్టు గుర్తు. పెండ్లి కాని గర్భిణితో కడుపులో పండపు ఆవేదన:
పిండపుదశలోనెపిండాలబావిలో
చేరిపోదునేమొచిదిమివేయ
జాలి జూపు మనగ లాలించ గానెంచి
పెండ్లి కాని పిల్ల బిడ్డనుగనె
పిండపుదశలోనెపిండాలబావిలో
చేరిపోదునేమొచిదిమివేయ
జాలి జూపు మనగ లాలించ గానెంచి
పెండ్లి కాని పిల్ల బిడ్డనుగనె
దత్తపది - 22 (కరము - తరము - వరము - హరము)(7/12/2012)
నాపైమోపిన కరములు
కోపంబునభీముఁజేతఁగూలు వివరముల్
నాపతరముగాదనుచున్
భూపతులప్రాణహరముముందేజెపుమా!
Wednesday, 11 July 2012
సమస్యాపూరణం -760 (తండ్రి నేర్పు విద్య)(11-7-2012)
సీ . యాక్టరు గానెంచ, డాక్టరు జేయగ యంబిబియస్సుకు నంప నేల?
టెండుల్కరునుమించి ఠీవిగా నాడగా క్రిక్కెట్టు గాక బీ టెక్కదేల ?
పాటగాడవ్వగా 'బాలు' ను మించినన్ విద్వాను చదువగన్ వెడల నేల?
యంతరిక్ష జ్ఞానమాపోసనము నెంచ సబ్మరైనుల గూర్చి చదువదేల?
ఆ.వె. యిష్ట పడిన చదువె కష్టమ్ము గాబోదు!
వత్తి డులను బెంచ నుత్త మమ్మె ?
నదియు నిదియు గాక నప్రయోజకుడైన
తండ్రి నేర్పు విద్య తప్పు గాదె?
Monday, 9 July 2012
సమస్యాపూరణం -758 (తల్లిబాసను రోసిరి)(9/7/2012)
భరత పట్టాభిషేకమ్ముజరుపమనుచు
మునపటివరములను గోరె కినుకబూని
రామవనవాస మెంచెను ప్రేమ మఱచి
తల్లి! బాసనురోసిరి పిల్లలెల్ల!
భరత పట్టాభిషేకమ్ముజరుపమనుచు
మునపటివరములను గోరె కినుకబూని
రామవనవాస మెంచెను ప్రేమ మఱచి
తల్లి! బాసనురోసిరి పిల్లలెల్ల!
Sunday, 8 July 2012
సమస్యాపూరణం - 756 (చిన్న సవరణ కలిగించె)(7-7-2012)
రంగు రంగుల మాధ్యమ హంగుఁ బెంచ
కక్ష్య జేరి యుపగ్రహ లక్ష్య మంద
దివికి భువికి సంధానపు తీగ తొలగ
చిన్న సవరణ కలిగించె వెన్నె లెన్నొ!
సమస్యాపూరణం - 755 (పట్టు నాజానుబాహువే)(6-7-2012)
ప్రజలు మెచ్చంగ రామన్న ప్రభుత నడిపె
సహనశీలమ్ముతో సీత సతిగ నొప్పె
ధర్మమార్గాన నడిపింప ధరణిజాతఁ
బట్టు నాజానుబాహుడు ప్రభువు మాకు.
ప్రజలు మెచ్చంగ రామన్న ప్రభుత నడిపె
సహనశీలమ్ముతో సీత సతిగ నొప్పె
ధర్మమార్గాన నడిపింప ధరణిజాతఁ
బట్టు నాజానుబాహుడు ప్రభువు మాకు.
సమస్యాపూరణం - 754 (సానిన్ గొల్చిన లభించు)(5-7-2012)
సానిన్నవాబు బట్టెన్
వాని నదృష్ట మది పట్ట పాలకు డాయెన్
కానీ లేని జవానా
సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!
వాని నదృష్ట మది పట్ట పాలకు డాయెన్
కానీ లేని జవానా
సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!
Subscribe to:
Comments (Atom)




