పద్య రచన - 112
ప్రతి వధువుకు వంకలు పెట్టే వరునికి, పెళ్ళి చేయటానికి,ఓ పెళ్ళిళ్ళ పేరయ్య
వినూత్నమైన 'కన్య స్కోపు' తెచ్చి వరునికిచ్చి ఓ కన్యను చూడమనగ,అందులో ఒకే
వధువు భిన్నవస్త్రధారణలతో కనిపించగా ఒప్పుకొని పెళ్ళాడాడన్నభావంతో:
పిల్లచక్కనైనఁ
బేరెట్టు వరునికి
'కన్య స్కోపుఁదెచ్చి గాంచ మనగ
పిల్లనొక్కతైనపెక్కురీతులఁజూపఁ
పిల్లనచ్చఁ గట్టె పెళ్ళిళ్లపేరయ్య?