Wednesday 29 August 2012


Aug 29, 2012

"సమస్యాపూరణం - 806 (తెలుఁగు భాషాభిమానము)"

అన్య భాషల(  విజ్ఞాన మంత నుండ
భాష లెన్నైన నేర్చిన(  బండితునకు
మాతృ భాషాభి వృద్ధిని మఱచి, యేల
తెలుగు భాషాభిమానము తొలగావలయు?

Thursday 23 August 2012







తమ కడుపు నిండఁ దామే
శ్రమించి పండించుడనెడు సారముఁ దెలుపన్
కమలాక్షుడు హల ధారిగఁ
శ్రమైక జీవన మనునది సౌందర్యమనెన్!
తమ కడుపు నిండఁ దామే
శ్రమించి పండించుడనెడు సారముఁ దెలుపన్
కమలాక్షుడు హల ధారిగఁ
శ్రమైక జీవన మనునది సౌందర్యమనెన్!
తమ కడుపు నిండఁ దామే
శ్రమించి పండించుడనెడు సారముఁ దెలుపన్
కమలాక్షుడు హల ధారిగఁ
శ్రమైక జీవన మనునది సౌందర్యమనెన్!

బుధవారం 22 ఆగస్టు 2012


పద్య రచన - 89 

తమ కడుపు నిండఁ దామే

శ్రమించి పండించుడనెడు సారముఁ దెలుపన్
కమలాక్షుడు హల ధారిగఁ
శ్రమైక జీవన మనునది సౌందర్యమనెన్!

                                                       



గురువారం 23 ఆగస్టు 2012

సమస్యాపూరణం - 801 (శిశుపాలుఁడు ప్రాణసఖుఁడు)


పశుపాలకుండనుచుఁద
న్ను శతంబుగ నిందఁజేయఁ నుతులే యనుచున్
'శిశు'ప్రాణైక్యముఁజేకొనఁ
శిశుపాలుడుప్రాణసఖుడుశ్రీకృష్ణునకున్!





బుధవారం 22 ఆగస్టు 2012

సమస్యాపూరణం - 800 (బలరాముని ధర్మపత్ని)

చక్రి శశియభిమన్యుల జంట మెచ్చి
యన్న గారినొప్పింపగ నదను జూచి
గొప్పవాడభియనిజెప్పెఁ గూడి సత్య
భామ, రుక్మిణిసతి, బలరామునకును





గురువారం 23 ఆగస్టు 2012


పద్య రచన - 90


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.



నెమలి పింఛంబది యమలిన శృంగార గురుతని దెలుపంగఁగొప్పుఁజేర్చె
 నేనన్నయహమును లోనను వీడగఁ మురళినిఁవాయించ మోవి( జేర్చె
గుణమది కౌస్తుభ మణివలె వెలిగినహృదయభాగమ్మునముదముఁజేర్చె
సాధుస్వభావమ్ముగోధనమ్మనిదెల్ప పావని గోవునుఁ బ్రక్కఁజేర్చె

విమలుల నిరహంకారుల వెంటఁజేర్చి
సాధు,గుణమణు లైనను సఖ్యుడగుచుఁ
గెలువఁలోకానఁజక్కటి గీతఁబలుక
సకల సందేశ రూపుని సన్నుతింతు.

Monday 20 August 2012


సోమవారం 20 ఆగస్టు 2012

పరశురాము నోడించె రావణుఁడు గినిసి.
సహదేవుడు చెప్పారు...
పరశురాముని,రావణ పాత్రధారు
లిర్వురికలహమదిమీఱి హెచ్చి వారు
లేచి కొట్టుకొనగ తెర లేచి నంత
పరశురామునోడించె రావణుఁడు గినిసి

ఆదివారం 19 ఆగస్టు 2012

పొట్టివాని భార్య పొడుగరి యఁట!
సహదేవుడు చెప్పారు...
విశ్వమెత్తుకలిమి వేల్పైన లక్ష్మిని
విశ్వరూపుడైనవిష్ణువంద
వామనునిగ బలిని పాతాళ మంపిన
పొట్టివానిభార్యపొడుగరియఁట!


శనివారం 18 ఆగస్టు 2012

నరసింహా! నిన్ను నమ్మి నాశన మైతిన్. 
సహదేవుడు చెప్పారు...
(నరసింహారావను డైరెక్టర్ తో నిర్మాత ఆవేదన)
సిరికై తీసితిఁ సినిమా
నరసింహా! నిన్ను నమ్మి,నాశన మైతిన్
వరదై పైరసి సీడీ
ల్విరివిగఁబారంగ నష్ట పీడితుడగుచున్!
పంది పుటుక్కునఁ గొఱికెను భామిని పెదవిన్.

సహదేవుడు చెప్పారు...
విందువినోదంబులనుచు
నందాల మగువలుసైత మాపబ్బులందున్
సందడిఁజేయనొకడుకై
పంది పుటుక్కున గొఱికెను భామిని పెదవిన్!
కమఠమునం జొచ్చి మేలుఁ గనె పథికుఁ డటన్.

సహదేవుడు చెప్పారు...
సుమసుకుమారత్వమెపుడు
శ్రమయనుభారమ్ముమోయఁజాలదనుచున్
గమనించి మానసికముగ
కమఠమునంజొచ్చిమేలుఁగనెపథికుఁడటన్!
స్వాతంత్ర్యము వచ్చె మనకు సంబర మడఁగెన్.

సహదేవుడు చెప్పారు...

నైతిక విలువలు వీడియు
చేతులు పొడవైన వారు సిరులన్ దోచన్
గోతులు మిగిలెన్ దూకగ
స్వాతంత్ర్యము వచ్చె మనకు సంబర మడగెన్!

పద్య రచన - 82

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! 

సహదేవుడు చెప్పారు...
బాపూజీ కన్న కలలు
రూపంబే దిద్దుకొనక,రూపాయే యే
పాపాన్నైనా గడుగగ
కోపంబున తలను వంచె గొప్పగు జెండే!
చేపలపులు సడిగెరా వసిష్ఠుడు ప్రీతిన్.

సహదేవుడు చెప్పారు...
చేపట్ట కామధేనువుఁ
కోపంబునశౌనకుండు కోరిన నైనన్
ఓపికవీడని వాడే
చేపల పులుసడిగెరా వశిష్టుడు ప్రీతిన్?
(సాత్వికుడు,బ్రహ్మర్షియైన వాడు ఉప్పు కారాల మాంసాహారము నెందుకు యడుగుతాడన్న ప్రశ్నార్థక పూరణ)
నాకు నీకు మాకు మీకు మనకు!

సహదేవుడు చెప్పారు...
ముఖ్యమంత్రి కాగోరి కుల,మత,ప్రాంతీయ భేదాలు సృష్టంచ వద్దని పార్టీలో తీర్మానము:
అర్హులైన వారు అధికులున్నారయ్య
ముఖ్యమంత్రి గాగ మ్రొక్కువారు
ప్రతిభ, పాటవములు పట్టిచూతములెండు
నాకు నీకు మాకు మీకుమనక
లే లే నా రాజ యనిన లేవఁడు రాణీ! 

సహదేవుడు చెప్పారు...
మనుమడి గురించి కూతురు రాణి తో తల్లి సంభాషణ:
గోలయని నీ కుమారుని
మేలని మాయింటవిడువ మీరలు, చదువన్
నీ లా వేకువ జామున
లే!లే! నా రాజ యనిన లేవడు రాణీ!

పద్య రచన - 78

సహదేవుడు చెప్పారు...
నీవుఁదప్పయన్యమెరుంగ నీరజాక్ష
గరుడగమన!రా!రా!యని గజముయేడ్వ
భక్తశరణాగతికిచక్రిపరుగుఁదీసి
కరినిఁ గాపాడ వచ్చెమకరినిఁజంప
చీకాకులె సుఖము నొసఁగి చింతలఁ బాపున్.

సహదేవుడు చెప్పారు...
ఏకాకి బ్రహ్మచారులు
మూకలుమూకలుగపబ్బు జేరన్
కేక,బయటి వారలకవి
చీకాకులె,సుఖము నొసగి చింతలు బాపున్!

వృద్ధురాలికి నేఁడు వేవిళ్ళు గలిగె !
సహదేవుడు చెప్పారు...
చందమామ కథలరాజుఁబొందగోరి
భామ పంతమ్ము వీడక బామ్మ యయ్యె!
అక్క మగడే నతివ నందె,నాశఁదీర
'కేరు' సంతాన సాఫల్య కేంద్ర మందు
వృద్ధురాలికి నేడు వేవిళ్ళుగలిగె!

Thursday 9 August 2012



గురువారం 9 ఆగస్టు 2012

దత్తపది - 24

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
శివునకు అలంకారాలైన
చంద్ర - నాగ - గంగ - భస్మ
పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
శ్రీకృష్ణుని స్తుతిస్తూ పద్యం వ్రాయండి.

సూర్యచంద్రనేత్ర! శుభనామ! భవనాశ!
సాగరమునఁదేలు నాగశయన! 
నీదు పాదగంగ నాదు జీవనగంగ
పద్మనాభ! స్మరణ వదల నెపుడు.

గురువారం 9 ఆగస్టు 2012

పద్య రచన - 76

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదిన శుభాకాంక్షలు!

మురళీ గానంబాపిన
                                            మరి మరి యా తన్మయమున మరువక నలరెన్
                                             పరిమళపు చిన్ని కృష్ణుని
                                            దరి జేరిన మధుప రాజి ధన్యత నొందెన్



బుధవారం 8 ఆగస్టు 2012

సమస్యాపూరణం - 787 (రాలు కరగించు నెదను)

రామమూర్తియే వినకున్న రమణి సీతఁ
ప్రేమఁజూపి కావుమనియెఁ రామ దాసు
భక్తుల వెతలఁ దీర్చని ప్రభువుల సఖు
రాలు కరగించు నెదను వరాల నిచ్చు!


బుధవారం 8 ఆగస్టు 2012

పద్య రచన - 75

అంగన నాట్యమయూరీ
భంగిమ, పార్థ ప్రవరాఖ్య వర్యుల మనసుల్
లొంగగఁజేయదె? వారలఁ
గొంగున ముడివేయదెనట కోమలి చూడన్!


మంగళవారం 7 ఆగస్టు 2012

సమస్యాపూరణం - 786 (సిగ్గులేనివాఁడు)


భృగువు వక్షమందు పొగరుగా తన్నినన్
పాదసేవ జేసి పాద మొత్త
అతివ సత్య తన్నె నటుపైన తలమీద
సిగ్గులేనివాడు శ్రీవిభుండు. 


సోమవారం 6 ఆగస్టు 2012

సమస్యాపూరణం - 785 (మాటకు నిలబడనివాఁడె)

మాటకునిలబడుటెరుగని
కూటమి నందుండి కూలి గోతిన పడకన్
బాటది వీడి గతించిన
మాటకు నిలబడని వాడె మాన్యుడు జగతిన్!


ఆదివారం 5 ఆగస్టు 2012

సమస్యాపూరణం - 784 (కరము కరము సౌఖ్య)

బాల భక్తుడైన ప్రహ్లాదు బ్రోచిన,
బాల్యమిత్రుఁగాచు భక్త వరదు,
మకరిఁజంపికరినిమనసారరక్షించు
కరము కరము సౌఖ్య కరము సుమ్ము


ఆదివారం 5 ఆగస్టు 2012

పద్య రచన - 72

ద్వాపరయుగంపుకృష్ణుని
గోపిక గాకున్న గాన కోకిళ తానై
తీపిగ హరినామమ్మా
లాపించతరమ్మె?సుబ్బలక్ష్మీమణికిన్!


శనివారం 4 ఆగస్టు 2012

సమస్యాపూరణం - 783 (శ్రావణమేఘములు గురియ)

జీవుల దాహముఁదీర్చగఁ
భూవనిఁగురిసితరియించు!,పూజకుతీగెల్
కోవెలఁజేర్చితరించగ
శ్రావణ మేఘములు!,కురియ సాగె సుమములన్!
( క్రమాలంకారం )


శనివారం 4 ఆగస్టు 2012

పద్య రచన - 71


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.