Monday 30 July 2012


సోమవారం 30 జూలై 2012

సమస్యాపూరణం - 778 (పాలు గాంచి పిల్లి)

ఇంటిలోనిపిల్లియెలుకవేటమరువ
వేడిపాలఁబెట్టవేట నేర్ప
పాలుగాంచిపిల్లిపారిపోయెఁ!దిరిగి
వేటలాడెనెలుకఁవిందుకొఱకు


సోమవారం 30 జూలై 2012

పద్య రచన - 66


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

Sunday 29 July 2012



ఆదివారం 29 జూలై 2012

సమస్యాపూరణం - 777 (కుచముఁ గోసె మగఁడు)

అరటి తోటఁజేరి నాలిమగనిగూడి
కాయఁగోయ తాను కరము లెత్త
పైట జారి కుచము బయటపడగఁగప్పి
కుచముఁ, గోసె మగడు కూర కొఱకు

ఆదివారం 29 జూలై 2012

పద్య రచన - 65


రామాయణ కాలంబున
ప్రేమారగఁ గౌగిలించవేడిన వారే!
భామామణులై కృష్ణుని
తామెల్లరుఁగౌగిలించి ధన్యులుఁగారే?
ఇచ్చిన మాటను దప్పక
నిచ్ఛలఁదీర్చంగవాడు .నింతులఁగూడన్
సచ్చరితుఁభక్తవరదుని
వెచ్చనికౌగిలిదొరకగ వేడెదమదిలో!
ఇచ్చిన మాటను దప్పక
నిచ్ఛలఁదీర్చంగవాడు .నింతులఁగూడన్
సచ్చరితుఁభక్తవరదుని
వెచ్చనికౌగిలిదొరకగ వేడెదమదిలో!



శనివారం 28 జూలై 2012

సమస్యాపూరణం - 776 (పాండవులకు శ్రీకృష్ణుఁడు)

ధర్మసంరక్షణంబునఁదాను నిలచి
పాండవులపక్షపాతిగ పరగు చుండ
కౌరవులు కీడుఁదలపెట్ట క్రూరముగను
పాండవులకు, శ్రీకృష్ణుడు వైరి యగును


శుక్రవారం 27 జూలై 2012

సమస్యాపూరణం - 775 (వరలక్ష్మీవ్రతముఁ జేయ)

ధరణిన్ యోగ్యత లేకనె
వరముల బడయంగలేరు! వాక్కిది వినుమా!
వరములఁ బొంద నయోగ్యులు
వరలక్ష్మీవ్రతముఁజేయవలదంద్రు బుధుల్!


గురువారం 26 జూలై 2012

సమస్యాపూరణం - 774 (కాకరపూ పూచి నిమ్మ)

ప్రాకంగనిమ్మచెట్టుకు
కాకర, పూపూచి నిమ్మ, కాయలు కాచెన్
కాకర కీటక నాశిని
గాకున్న పెరటి నిమ్మ,కాసులొసగునే?
(పెరటి నిమ్మ చెట్లు ఇంటి అవసరములకు మించి కాయల నీయగా, అమ్మితే డబ్బులొచ్చాయన్న భావం)



బుధవారం 25 జూలై 2012

సమస్యాపూరణం - 773 (విషము సేవింప నాయువు)

హిరణ్యకశ్యప,ప్రహ్లాదుల సంభాషణ:

హరిని మరువక ప్రహ్లాద!తిరిగినంత
కాలకూటవిషమునీకుమేలనంగ
తండ్రియానతి పాటించి దలచి హరిని
విషముసేవింపనాయువు పెరుగు నయ్య!

Tuesday 24 July 2012




సోమవారం 23 జూలై 2012

పద్య రచన - 59





రామ బాణమ్ముసంద్రుని రౌద్ర మణచ
రామ నామమ్ముసోకంగ రాళ్ళుదేలె
ఉడుత వారధిఁ గట్టగ నూతమీయ
కొట్టి రావణుఁ రాముఁడు బట్టెఁసీతఁ!

24-7-2012 నాటి సమస్యాపూరణం

నాదు వలువ లూడ్చి నన్నవమానించ
కౌరవ సభ యందు మీ రలుండి
చేష్ట లుడిగి చూడసిగ్గని పాంచాలి 
మగని దూల నాడిమాన్య యయ్యె!  


 

Monday 23 July 2012



ఆదివారం 22 జూలై 2012

పద్య రచన - 58


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

నా బాల్యము లో హరివింటి నారిని మీటితే వీణ వలె సప్తస్వరములు పలుకుతాయేమొ? భూతలమ్మున మొదలై నింగి కెగసి వంగి భూతలమ్ము తాకిన వింటి నారి భూతలమ్ము వెదికితే కనిపిస్తుందని భ్రమ:

నింగి హరివింటి నారిని నేను మీటి
సప్త సుస్వర నాధమ్ము జాలువార
వినగ భూతలమ్మంతయు వెదకి జూడ
నారి కనరాదె? దాటిన నాల్గు పదులు!


శనివారం 21 జూలై 2012

పద్య రచన - 57


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండ
నా పూరణ
 కం. తానే తాంబూలంబై
                                                  శ్రీనాధుని నోటఁ జేరి సీసముఁ బల్కెన్
                                                   నేనును పుక్కిటబట్టగ
                                                  ఈనాడీకందమగుచునిక్కడఁజేరెన్

Saturday 21 July 2012


గురువారం 19 జూలై 2012

సమస్యాపూరణం -767 (ముగిసె నాషాఢ మని)

తల్లి గారింట చేరిన తరుణి దల్చె
కంతుడనుకొన్నపెనిమిటికాలుడనుచుఁ
భర్త వచ్చెను గొనిపోవ పత్నినపుడె
ముగిసెనాషాఢమనియేడ్చెముద్దుగుమ్మ!

బుధవారం 18 జూలై 2012

సమస్యాపూరణం -766 (వచ్చినపని సఫలమయ్యె)

సచ్చీల సీత గాంచియు
విచ్చలవిడి లంక గాల్చివేడుకఁబొందన్
సచ్చరితుండుహనుమ తా
వచ్చినపనిసఫలమాయెవైరము హెచ్చెన్!


"సమస్యాపూరణం -765 (భాష రానివాఁడె)"(17-7-2012)



తనదు రంగ మందు ‘తా నేర్పుతోడను
నేర్చుకొన్నవిషయనిర్వచనము
పదుగుఱెదుటనర్థవంతమైబల్కుదు
ర్భాషరానిఁవాడె పండితుండు!




శుక్రవారం 20 జూలై 2012


సమస్యాపూరణం -768 (కపిని వలచి గిరిజ)

కత్తి పిచ్చి రాజు కపియని పేరొంది

సాఫ్టువేరు పోస్టుచక్కబెట్ట

పేరు పిచ్చి గాని జోరైన వాడని

కపిని వలచి గిరిజ తపము సేసె!

(ఇక్కడ గిరిజ పార్వతీ మాత కాదు)



"సమస్యాపూరణం -769 (ఆంగ్లభాష యుండ)"(21-07-2012)


అమెరి కన్లు బలుక నమ్మవంటి దినైన
ఆంగ్ల భాష యుండ నాంధ్ర మేల ?
తెలుగు దేశ మందు తేనియ లూరెడు
నాంధ్ర భాష యుండ నాంగ్ల మేల?

Saturday 14 July 2012



అడుగడుగు దండముల వా
డిడుగిడుగోయేడుకొండలేలెడిఱేడున్
వడివడిగబడుగులనుఁగా
చెడువానింగొలువ సిరులుచేకుఱుమనకున్!
సమస్యాపూరణం -763 (కోటి కంటె యొకటి) (15/7/12)

ఒకటి నాని యేడు నొట్టి సున్నాలున్న
కోటి యౌను విలువ మేటి గాను
ఒకటి లేని కోటి యొట్టి  సున్నే యైన
కోటి కంటె యొకటి మేటి గాదె !

Friday 13 July 2012


సమస్యాపూరణం -761 (పెండ్లికాని పిల్ల)(13-7-2012)
పిండాల బావి గూర్చిన కవిత నొక పుస్తకావిష్కరణ సభలోవిన్నట్టు గుర్తు. పెండ్లి కాని గర్భిణితో కడుపులో పండపు ఆవేదన:

పిండపుదశలోనెపిండాలబావిలో
చేరిపోదునేమొచిదిమివేయ
జాలి జూపు మనగ లాలించ గానెంచి
పెండ్లి కాని పిల్ల బిడ్డనుగనె


దత్తపది - 22 (కరము - తరము - వరము - హరము)(7/12/2012)



నాపైమోపిన కరములు
కోపంబునభీముఁజేతఁగూలు వివరముల్
నాపతరముగాదనుచున్
భూపతులప్రాణహరముముందేజెపుమా!

Wednesday 11 July 2012



సమస్యాపూరణం -760 (తండ్రి నేర్పు విద్య)(11-7-2012)




సీ .     యాక్టరు గానెంచ, డాక్టరు జేయగ యంబిబియస్సుకు నంప నేల?
   
          టెండుల్కరునుమించి ఠీవిగా నాడగా క్రిక్కెట్టు గాక బీ టెక్కదేల ?
   
           పాటగాడవ్వగా  'బాలు' ను మించినన్   విద్వాను చదువగన్ వెడల నేల?

          యంతరిక్ష జ్ఞానమాపోసనము నెంచ  సబ్మరైనుల గూర్చి చదువదేల?


ఆ.వె.  యిష్ట పడిన చదువె కష్టమ్ము గాబోదు!

          వత్తి డులను బెంచ  నుత్త మమ్మె ?

           నదియు నిదియు గాక నప్రయోజకుడైన

           తండ్రి నేర్పు విద్య తప్పు గాదె?
         
       

Monday 9 July 2012

సమస్యాపూరణం -758 (తల్లిబాసను రోసిరి)(9/7/2012) 


భరత పట్టాభిషేకమ్ముజరుపమనుచు
 మునపటివరములను గోరె కినుకబూని
 రామవనవాస మెంచెను ప్రేమ మఱచి
 తల్లి! బాసనురోసిరి పిల్లలెల్ల!

Sunday 8 July 2012


    సమస్యాపూరణం - 756 (చిన్న సవరణ కలిగించె)(7-7-2012)


    రంగు రంగుల మాధ్యమ హంగుఁ బెంచ
    కక్ష్య జేరి యుపగ్రహ లక్ష్య మంద
    దివికి భువికి సంధానపు తీగ తొలగ
    చిన్న సవరణ కలిగించె వెన్నె లెన్నొ!
   సమస్యాపూరణం - 755 (పట్టు నాజానుబాహువే)(6-7-2012)


    ప్రజలు మెచ్చంగ రామన్న ప్రభుత నడిపె
    సహనశీలమ్ముతో సీత సతిగ నొప్పె
    ధర్మమార్గాన నడిపింప ధరణిజాతఁ
    బట్టు నాజానుబాహుడు ప్రభువు మాకు. 
    సమస్యాపూరణం - 754 (సానిన్ గొల్చిన లభించు)(5-7-2012)

   సానిన్నవాబు బట్టెన్
    వాని నదృష్ట మది పట్ట పాలకు డాయెన్
    కానీ లేని జవానా
    సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్!