Monday 30 April 2012

                                                                     శ్రీ గణేశాయ నమః 

సీ. సుధల చిలకరించు సుందర దరహాస 
                      మెప్పుడు  మోమున మెదలు చుండ
     ధారణా శక్తితో తనవారి నందర 
                       అధికారుల ఎదుట ఆదుకొనుచు
      కరుణార్ద్ర హృదయాన శరణన్న వారికి
                        సమయోచితంబుగా సాయ మిచ్చి
       రసహృద యుండన రాణించి  సంగీత 
                        సాహిత్య విషయాల సరస నుండ

తే.గీ. నేడిట పదోన్నతిని బొంది వెడలు చుండ 
         కళ్ళ యానంద భాష్పాలు కదలు చుండ
         భావి జీవిత మంతయు చేవ నిచ్చి 
         ఆంజనేయ స్వామీ తమకు అండ నుండు! 
                                   

Sunday 29 April 2012

ఆ.వె. మానసికపు స్థాయి అనువుగా లేనట్టి
         విలువ లెరుగ నట్టి ఆలుమగలు
         వెధవ యనుచు మగని వెక్కిరింతల బిల్చ
         విధవ యనుచు బిల్చె విభుడు సతిని!



శ్రీయుతులు పండిత నేమని  గార్కి,
కృతజ్ఞతలు.నా పూరణమును సరిజేయుచున్నాను.
కం. వినుమా  ధ్యానము యోగము
       అనుదిన మభ్యాసమిచ్చు ఆరోగ్యములన్
      ఘన సాధన జేయుచు, చెడు
      కనము,వినుము, పలుకమనెడు జ్ఞానులకు నతుల్.
చివరి వాక్య్యాన్ని సరి చున్నాను:
బోడి గుండంట  జడలేమొ బోలెడంట!
కార్య నిర్వహణార్థపు చర్య లుడిగి ,
మానవ ప్రయత్నమన్నది మఱచి పోయి, 
నీవె దిక్కని మ్రొక్కిన నిష్పలంబు
ఏడుకొండల వాడు కాపాడ లేడు!

Saturday 28 April 2012


¥Á ÂœÁÇ ¤Â«Á œÉ¨ÅÁÅ¨Í ¥ÁýÂì™ÃÏžÁþà ±Â©Áþà €þÊ úÃþÂä§Ãþà ©ÂœÁ¨Å œÊ¨Ê¨Â ÌýÃÛþÁ¬ÁÏŸÁ§ÁèϏ þ ÿÁÇžÁ¦Á ¬ÁåÏžÁþÁ:

: œÊ.Ä. ¥Á ÂœÁǤ«Á ©Á¨ÃìÏúÃþÁ ªÁœÁÇ ©Áగునె?
         ©ÂœÁ ¥Á§Á¡ÁôþÊ üÄ©ÁÏ¡Áô ©Â›Ã þÉýÅì?
         ©ÊžÁþÁ¨ ¥Á ÂœÁǤ«Á¦Ê ©ÊžÃకగు þÁÅ!
         ¡Êë¥ÁœÍ™ÁþÊ ¡Á§Á¤Â«Á ¡Ãë¦Á¥ÁÅ కూర్చు!
                  ............ ÁÅϙ వెంకý ¬ÁÅ£ç ¬ÁÿÁžÊ©Áô™ÁÅ
                             ±ÌëžÁÅâýƧÁÅ.
                              Á™Á¡Á üèÂì

గురుభ్యోనమః 
నిన్నటి నా పద్యంలో తమరి సవరణ బాగుంది.

నేటి పూరణ:
పాండవులు పడిన కష్టాల మూలంగా వారిపై జనసామాన్యుల  అభిప్రాయం.

అన్నదమ్ముల తండ్రులా? అన్య సురులు!
ఐదుగురు పతులుండియు  అతివ  వగచె!
అడవులజ్ఞాతవాసాల గడచె బ్రతుకు!
పాండు తనయుల మించిన పాపు లెవరు?
 క్రితంలో  ఒక తల్లి అక్రమ సంబంధం కలిగి, పరపురుషుని ఎదుట సొంతకూతుర్ని హింసించిందని  చదివిన వార్త ఆధారంగా :
కం.  దహియించెడు కామమ్మున 
       దుహితను హింసించె చపల దుర్వ్యసను కడన్
       మహిలోతలపన్ తగనా
        మహిళను దూషించువాడు మాన్యుడు జగతిన్ 
     

Friday 27 April 2012

రామ మూర్తికే   తీపైన  నామ మేది ?
'దాశరధి' యన్న నామమ్మె! తనివి దీర్చు!
అట్టి 'దాశరధీ శతకంపు పద్య
పాద' రసమన్న తీయని పాన కమ్ము!

Thursday 26 April 2012

samasyaapuranam


సహదేవుడు చెప్పారు...
సీతాన్వేషణ మరచి తార పరిష్వంగంలో మునగిన సుగ్రీవుని, రామభక్తి పరాయణ శునకము కోపంతో కరిచిందన్న భావంతో:
నిగ్రహమువీడి తారా
సుగ్రీవులలరి రఘుపతిసూచన మరువన్,
ఉగ్రముగ, బాధ్యతఁదెలుపన్
సుగ్రీవునియెడమకాలుశునకముఁగరిసెన్
April 26, 2012 7:27 PM

Tuesday 24 April 2012


సహదేవుడు చెప్పారు...
ఆదిఅవతారమయ్యది హరియుఁదాల్చె?
నోటపూతనప్రాణమెచ్చోటఁబీల్చె?
స్వామిగోపికింటనుదూర ఏమియుండె?
చేప,చన్నులలోఁ,పాలు
చెంబెడుండె.

Saturday 21 April 2012


కంది శంకరయ్య చెప్పారు...
గుండా సహదేవుడు గారి పూరణ....

కలిమిలేము లిలను కడు సహజమ్మని
తోటివారి సేవ తొలుత  యనుచు
ఆర్తు లైన వారి నాదుకొనగ నెత్తు
కరము కరము మోదకరము
April 14, 2012 2:16 PM

కంది శంకరయ్య చెప్పారు...
గుండా సహదేవుడు గారి పూరణ....

రాతిని నాతిగా రాముడు జేయ
పతిత పావన రామ ప్రార్ఠన సుఖము
కారణ భూతుడౌ కాముకుడు సుర
పతినింద గల్గించు పరమ సుకమ్ము
April 13, 2012 3:22 PM

సహదేవుడు చెప్పారు...
వినరో సత్యము భక్తులు
హనుమంతునివేడుకొనిన, నాయువు తీయున్
దునిమిదునిమిదుష్టాదుల
మనకునొసగిధైర్యస్థైర్యబలముల ప్రీతిన్
April 18, 2012 10:22 AM

సహదేవుడు చెప్పారు...
వినరో సత్యము భక్తులు
హనుమంతునివేడుకొనిన, నాయువు తీయున్
దునిమిదునిమిదుష్టాదుల
మనకునొసగిధైర్యస్థైర్యబలముల ప్రీతిన్
April 18, 2012 10:22 AM

కంది శంకరయ్య చెప్పారు...
గుండా సహదేవుడు గారి పూరణ....

ఎల్లవేళల చిరునవ్వు లెక్కుబెట్టి
మధురభాషణమే సరిఁ బెదవిఁ బల్కి
కార్యనిర్వహణార్థముఁ గలిగెడుఁ జిరు
కోపమే భూషణము నీతికోవిదులకు
April 17, 2012 5:16 PM

సహదేవుడు చెప్పారు...
గురువుగారిప్రశ్న
గురిఁజూచిశిష్యుడు
అల్లసానివ్రాసెననుచుఁజెప్పె
గరిమఁదెలియ ఉరమ కంగారునిట్లనె
మనుచరిత్రకర్త మంచన?కద!?
April 20, 2012 2:04 PM

ప్పారు...
గుండా సహదేవుడు గారి పూరణ....

హేపరమేశా! కావగ
చూపుము మాపై కరుణను స్తోత్రముఁ జేయన్
తూపులఁసంధించగనే
పాపములకు, మూలము లగుఁ బశుపతి పూజల్.
April 10, 2012 11:26 AM

devjeesaha చెప్పారు...
ఆ.వె. మానసికపు స్థాయి అనువుగా లేనట్టి
విలువ లెరుగ నట్టి ఆలుమగలు
వెధవ యనుచు మగని వెక్కిరింతల బిల్చ!
విధవ యనుచు బిల్చె విభుడు సతిని!
April 04, 2012 8:14 PM


కంది శంకరయ్య చెప్పారు...
గుండా సహదేవుడు గారి పూరణ....

రంగితోడిరాజు రాసక్రీడలఁదేల
చెఱకుఁ దోటఁజేర చెలిని బిల్చ
సందెవేళజంట'విందుకై'పనిజెప్ప
చెప్పులకు,లభించె చెఱకు'తీపి'
April 21, 2012 6:25 PM

Monday 16 April 2012

గురువర్యులకు నమస్సులు,
నూతన దంపతులకు వివాహ శుభాసీస్సులు


కమ్మదనమునిచ్చు కల్పన కావ్యాన
కల్పనిచ్చు  సిరుల క్రాంతి యింట
ధరలు నింగి నంటి దారిద్ర్యమును బంప
బడుగుజీవుల కడుపు మాడు చుండ
అభ్యుదయ కవిత్వ మలరించ శాంతియు,
క్రాంతి యనగకవుల కల్పన కదా!




నేటి సమస్యకు పూరణ:
లేని నటి స్థానమందున లేమ పాత్ర
విజ్ఞులాన టుని బొగడ వేది కెక్క
పిల్లమూకొకటి జడల పీకి నంత
బోడి  గుండంట జాడలేమొ బోలె డంట!







Saturday 7 April 2012


తే. గీ. సరస సాహిత్య గోష్టుల మెరయ బల్క!
          శిష్య కవులను దీవించు శ్రేష్టు లైన
           గురుగణంబుల  వాత్సల్య భరితమగు
           కౌగిలింతలే కవులకు ఘనత నొసగు.

           పెద్దలకు ప్రణామములు తప్పులున్న తెలియజేయ ప్రార్థన.

Friday 6 April 2012


శ్రీయుతులు పండిత నేమని  గార్కి,
కృతజ్ఞతలు.నా పూరణమును సరిజేయుచున్నాను.
కం. వినుమా  ధ్యానము యోగము
       అనుదిన మభ్యాసమిచ్చు ఆరోగ్యములన్
      ఘన సాధన జేయుచు, చెడు
      కనము,వినుము, పలుకమనెడు జ్ఞానులకు నతుల్.

Wednesday 4 April 2012

ఆ.వె. మానసికపు స్థాయి అనువుగా లేనట్టి
         విలువ లెరుగ నట్టి ఆలుమగలు
         వెధవ యనుచు మగని వెక్కిరింతల బిల్చ!
          విధవ యనుచు బిల్చె విభుడు సతిని!



Sunday 1 April 2012

గురువర్యులకు మరియు కవివర్యులకుశ్రీ రామ  నవమి శుభాకాంక్షలు.
గత నాలుగైదు రోజులుగా బ్లాగు శ్రీ రామ నామముతో  పావనమవుతున్నందులకు
మిగుల సంతసముగా నున్నది.
తే.గీ.  రామ రామన్న నామమ్మే ప్రేమ బల్క
         పాప కూపంబు జనులకు జూప దనియు
          రామ నామ మనిన రక్తి, రాక్షసులకు
          సూటి బాణ మై  వదలక కాటి కంపు!