Thursday 28 June 2012

28-6-2012 నాటి నిషిద్ధాక్షరి - 4(టవర్గ (ట,ఠ,డ,ఢ,ణ) అక్షరాలను ఉపయోగించకుండా టంగుటూరి ప్రకాశం పంతులు గురించి మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.)


సుప్రకాశ భరత దేశ శోభ గోరి
రోషమున తుపాకి నెదరి రొమ్ము జూపి
శ్వేత గజముల స్వప్నాల సింగ మవ్వ
ఆంధ్ర కేసరి బిరుదమ్ము నతికె సుమ్ము!


Wednesday 27 June 2012

27-6-2012 నాటి సమస్యాపురణం

శ్రీకృష్ణ భగవానుడు  సంధి జేయుటకు సుయోధనునితో పలికిన పలుకులు :

వినుము సుయోధనా! తమరు పెట్టిన బాధలనోర్చిపాండవుల్ 
ననునిటు దూతగన్ బనుప నాశము గోరక సంధి జేయగన్ 
కనుగొన వచ్చితిన్ జనుల గావగ యుద్ధము మాన్పగ న్నివా 
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్.

Tuesday 26 June 2012

26-6-2012 నాటి సమస్యాపూరణం

 
(అభిజ్ఞాన శాకుంతలం భూమికగా)

సుమశరు తూపు కౌశికుని, సుందరి మేనకఁ గూడఁ జేయఁగన్ 
సుమసుకుమార పుత్రిఁగని చూడక గానల వీడ, కణ్వు నా 
శ్రమపు శకుంతలాఖ్య యయె,రాజొకఁ డామెను జూచు, నాటకీ 
యము గని ముచ్చటంబడి మహాకవి మెచ్చెను గూర్చె సత్కృతిన్ ! 




Monday 25 June 2012

వర్ణచిత్రానికి పద్య రచన

వెన్న గిన్నె నేల వీధుల దేచ్చేవు
నాడి పోసు కొనగ నాడ వారు
దొంగ వాడవనుచు తోటి వారాలు దిట్ట
నింద లన్ని స్తుతుల? నీకు కృష్ణ?



దత్తపది - 21 (అక్క, అన్న, వదిన, మామ) (25-6-2012)

శ్రిగురుభ్యోనమః

అక్కడి పతియే మదిలో
నిక్కడ కలడన్న సీతనిక నీవిడక
న్నిక్కిన  చావది నక్కును
జక్కగ వినుమా! మముగని జాతిని నిలుపన్!




Sunday 24 June 2012

24-6-2012 నాటి సమస్యాపూరణం

విద్య కొలవుల నందించు వేల వేలు
కొలువు లిచ్చెడు వాడిగ( గూడ (జేయు 
మైక్రొ సాఫ్టు బిల్ గేట్స ట్లు విక్రమించి 
కడు దరిద్రు(డు రాజయోగమ్ము నందె




Friday 22 June 2012

22-6-2012 నాటి సమస్యాపూరణం



గోలీ లాటలనుండే
జాలీ తిరుగుడు,జులాయి, జారిణి సుఖముల్
గ్రోలియు నేడట్టి విలా
సాలిని ద్యజియించెడి పతి హాయిగ నుండున్.

23-6-2012 నాటి సమస్యాపూరణం

ధర్మపాలనమన  తల్లడిల్లెడివారు
తరుణులందుఁబెళ్ళితంతులందు
ప్రాణ మాన విత్త హానులదప్పింప
కల్లలాడువారుకవులుసుమ్ము





Thursday 21 June 2012

21-6-2012 నాటి శంకరాభరణం సమస్యకు పూరణం

వశుడై కౌశికు తోడన్ 
కుశలురనగ తమ్ము రాము గూడి వనముదౌ 
దిశ(బంపనెంచ విచలిత 
దశరథు(డే ,పనులకేగె(దపసులు మెచ్చన్.

Wednesday 20 June 2012

మద్యనిషేధ చట్టమును మాన్యుడు రాము(డు రూపు దిద్దగన్
చోద్య మదేమియో పిదప చోదకులెల్లరు నీరుగారినన్
బాధ్యత లేక పాక్షికపు మార్పులజేయగ నిశ్చయించినన్
 మద్యనిషేధచట్టమును మానిను లెల్లఁ దిరస్కరించిరే!


(రాముడనగ శ్రీ నందమూరి తారక రామరావుగారనుకొనప్రార్థన )

Monday 18 June 2012

అర్జునుడు కృష్ణుడితో పలికిన పలుకులు:

 నీదు వాత్సల్య బలమున నీరజాక్ష !
  బిడ్డడా వాడు? రణరంగ భీకరుండు
  శత్రువుల ద్రుంచ వంచించి చంపినారు 
  ధర్మ సంరక్షణము వీడి దాగనేల?  


కంది శంకరయ్య చెప్పారు...
సహదేవుడు గారూ, 
సహదేవుడా సెబాసని
యహమహమిక లేక మెత్తు రందరు నీ ఖే
దహరమ్మగు పూరణమును,
మహనీయుడు పార్థసఖుడు మధురిమనొసగున్ 
శ్రిగురుభ్యోనమః
ఆర్యా,
ధన్యవాదములు. తమరిసూచన  మేరకు  సవరణ:


ఆత్మ దెలియు నంతర్ముఖ యాణ మందు
నిత్య తద్ధ్యాన సాధన నేర్పు నిచ్చు
భువిని పంచేంద్రి యాసక్త భోగ, మోహ
జాలమే యవరోధమ్ము సాధకులకు 

Sunday 17 June 2012

దైవ పూజలే మనకిచ్చు ధర్మగుణము
వివిధ భక్తి మార్గములు ప్రాప్తించు టన్న
తనదు గతజన్మ పుణ్యంబు ,దైవ ప్రేరి
తమ్ము, గొలచిన యెడల స్వాంతమ్ము లలరు.http://kandishankaraiah.blogspot.in/2012/06/738.html?showComment=1339943463326#c2260088178295925326

Saturday 16 June 2012



అమరిన పొదినందు నన్వాస్త్రమొకటైన
పొరుగువానిమదినిఁబుట్టుభయము
తెప్పఱిల్లిపొందఁ ధీటైనతద్దణు
బాణు,రాజ్యమొసగుపరమసుఖము

అరయ రావణుండుహరివరాధీనుడై
మోక్షగాముడైనరాక్షసుండు
తాక కుండఁసీతఁ తనచావుకైదెచ్చి
రక్షణమ్మునొసఁగురాక్షసుండు

Thursday 14 June 2012

http://kandishankaraiah.blogspot.in/2012/06/735.html

మేలిమి బడిలో(  జేర్చిన
కాలానుగుణంపు పోటి( గానక ( దిరుగన్
కూలీ బ్రతుకే సరి,గున
పాలిమ్మని సుతుని భర్త పాలికి( బంపెన్!

Wednesday 13 June 2012


బిడ్డకుఁబెండ్లిఁజేయగనుమేలిమిచీరలఁదెచ్చి,పట్టుదౌ
గుడ్డకురంగులన్గలిపికొంగునకద్దగ సంప్రతించగన్
దొడ్డగురూపమున్వెలయుఁదూలికఁబట్టుకునిట్టులెర్ర రం
గడ్డము గీచుకొమ్మనుచుకాంతుఁడుభార్యకుఁజెప్పెఁబ్రీతితోన్.

Tuesday 12 June 2012

 భౌతిక సుఖ ధుఖ బాట భ్రాంతి యనుచు
 శాశ్వతమగు సంత  సంబు వెదకి
 తరగి పోని సచ్చిదానంద మొసగెడు
  భోగ రక్తుడగు  ముముక్షు వెపుడు   

Sunday 10 June 2012


శ్రీఆదిశంకరాచార్యులవారు చిన్నవయసులోనెఅస్తమించుటను అన్వయిస్తూ:

కారె శంకరులాధ్యాత్మికాకశాన
సూర్యభగవానుఁబోలినశుద్ధవెలుగు
కాంతులిటకావలసియున్నకన్నుమూయ
వార్ధిలోమున్గెభానుడుపగటివేళ! ...........(.సమస్య )

మూకలకొద్దిసైన్యమునబోలెడువీరులునిండియుండగన్
రాక జయంబునెట్లుఁజను రాజ్యమువీరులభోజ్యమంచుపెన్
గేకలుపిక్కటిల్లగనె,గెల్చెడునూహలు'కావు' 'కావ'నన్
గాకినిఁజంపికౌరవులుగర్జనసేసిరిసంతసమ్ముగన్!

1.బ్రతుకీడ్చగ దొమ్మరి దం
   పతులే విన్యాసమెంచి పటిమనుజూపన్
   అతి కష్టంబుగ నిలువన్
   పతిపైనన్ బరమసాధ్విపాదము మోపెన్!

2.పితరులసద్గతికొరకై
  క్షితిపైగంగాస్రవంతిచిందులనోపన్
  నుతియించభగీరధుఁడా 
  పతిపైనన్ బరమసాధ్విపాదము మోపెన్!

1. కొండలప్రేల్చెడుయెండలు
    మండగ, వడగాలులబడి బ్రతుకులుమాడన్
    నిండైన నీడన,విడచి
    ఎండనునిద్రించ సుఖమునిచ్చునుమిగులన్


2. గుండక్కఁబోలుగయ్యా
    లుండినఁబతికెట్లునిద్రలుండును పోరన్
    మెండగునీడన,వీడియు
     నెండను,నిద్రించసుఖమునిచ్చునుమిగులన్!

పూలే లేవని యలుగడు
పాలేలేకనభిషేకమడుగడుశివుడా
లీలలుపాడినమస్కా
రాలనురువ్వుజనులకువరాలనొసంగున్!

రాముడుధర్మవిగ్రహమని రాజ్యము లోకముప్రస్తుతింపగన్
ప్రేమలుజూపగన్ మిగులపిన్నలుపెద్దలుమ్రొక్కుచుండగన్
రాముడుసేయలేనిపనిరా?కపులెల్లరకున్ సుసాధ్యమే
రామునినామమేజగతిఁరక్షణజేయునటంచుఁదెల్పగన్!


భారమనక హిమ్సోధ్యమ 
సారధిస్వాతంత్ర్యదేశసాధకుడాయెన్
పోరాటపటిమగల శ్రీ
కారములేకున్నకావుకార్యములెందున్!
ఆశావాదదృక్పథ స్పూర్తితో:
పోరుకు ముందరె క్రీడా
కారులు'వి' నిజూపి విజయకాంక్షనుదెలుపన్
జేర విజయతీరమ్ము 'వి'
కారము లేకున్న కావుకార్యములెందున్

భర్తచావుమండోదరిమదినిఁదోచె
స్త్రీసహజచిత్తమేపతిధ్యాసగొల్ప
రావణాగమనముఁగోరె,రమణిసీత
కోరె రామనాధుని ప్రేమకొరతదీర!

3/06/12 నాటి సమస్య కు పూరణం

ఖర సురభీ జన్యువులే
సరి క్లోనింగుమిలితాన జననం 
ధరణీతలంబునందున్
సురభికిజన్మించెఖరముచోద్యమెటులగున్






Friday 1 June 2012

2 -6 -2012 నాటి సమస్యకు నా పూరణ

అనవరతము హరి కీర్తన
సునిసితపు నడత, పలుకున్ సూనృత  వాక్యము
తొణికించియు  కరుణా భరి
త నయను సేవింప నొవు దద్దయు సుఖముల్!