Thursday 11 September 2014

భావించి విఘ్ననాథునిఁ
బావన భాద్రపదచవితిఁ బత్రియుఁ గుడుముల్
బ్రోవఁగ నిడి నైవేద్యం
బావల భుజియించుటే శుభావహ మందున్! (samasya)
రాగ మూలము స్వజనను రాగ మొకడె!
రోగ మూలము దుర్జన భోగ మొకడె!
ఆత్మ మూలము ధ్యానము నందుఁగనుటె
భోగ మూలము సజ్జన! త్యాగ మొకడె!(samasya)

పద్య రచన - 122


తల్లిదండ్రులెరుగనితరుణినేను
ముద్దుమురిపెమ్ముజూపగఁబొంగి పోయి
మనువు గాంధర్వమైననుమౌని నైతి
బేగి గొంపోవ నారాజ సాగి రమ్మ
నుచు శకుంతలలేఖలోనుడువ,చివర
నతివ కన్నీటి సంతక మతికె నంత

పద్య రచన - 121 

       

శిఖరమ్మునకొలువై,నీ
వఖిలమ్మునుగావ నీశ యంజలులివె! నీ
ముఖ మూలఁ భక్తి పారిన
సుఖమన్నదిగూడునంటశుభకర శూలీ!

 

 

 

అయ్యలు దోచెడు రాజ్యం
బయ్యెగ భారతమని మనమందున గల రా
మయ్యను దోచెదరని యా
దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్! (samasya)
అవినీతికి సాటి ధర్మ మవనిన్ గలదే!