గుండా వేంకట సుబ్బ సహదేవుడు
Thursday 11 September 2014
భావించి విఘ్ననాథునిఁ
బావన భాద్రపదచవితిఁ బత్రియుఁ గుడుముల్
బ్రోవఁగ నిడి నైవేద్యం
బావల భుజియించుటే శుభావహ మందున్! (samasya)
రాగ మూలము స్వజనను రాగ మొకడె!
రోగ మూలము దుర్జన భోగ మొకడె!
ఆత్మ మూలము ధ్యానము నందుఁగనుటె
భోగ మూలము సజ్జన! త్యాగ మొకడె!(samasya)
సెప్టెంబర్ 24, 2012 10:24 PM
పద్య రచన - 122
తల్లిదండ్రులెరుగనితరుణినేను
ముద్దుమురిపెమ్ముజూపగఁబొంగి పోయి
మనువు గాంధర్వమైననుమౌని నైతి
బేగి గొంపోవ నారాజ సాగి రమ్మ
నుచు శకుంతలలేఖలోనుడువ,చివర
నతివ కన్నీటి సంతక మతికె నంత
పద్య రచన - 121
శిఖరమ్మునకొలువై,నీ
వఖిలమ్మునుగావ నీశ యంజలులివె! నీ
ముఖ మూలఁ భక్తి పారిన
సుఖమన్నదిగూడునంటశుభకర శూలీ!
సెప్టెంబర్ 23, 2012 3:08 PM
అయ్యలు దోచెడు రాజ్యం
బయ్యెగ భారతమని మనమందున గల రా
మయ్యను దోచెదరని యా
దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్! (samasya)
సెప్టెంబర్ 23, 2012 3:58 PM
పద్య రచన - 120
అల వెంకటేశు పెళ్లికి
కొల చిచ్చావట కుబేర! కోరగ నరువున్!
యిల దోపిడీల పాలై
మలమల జనులాకొనంగ మమ్ములఁగనవా?
అవినీతికి సాటి ధర్మ మవనిన్ గలదే!
9/22/2012 06:16:00 AM
చవి చూడ నొక్క మారు ప
దవు లిచ్చెడి గ్రాస తీపి తరమే మరువన్!
శివ! పదవే చిరునామా
అవినీతికి, సాటి ధర్మమవనిన్ గలదే!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)