Wednesday 30 May 2012

31-5-2012 నాటి సమస్యకు నా పూరణ :


హరి నరుడై జనించెన్ 
ధర లంకేశుని వధించ దశరధ సుతుడై 
యరయన్ వానర సేవిత
నరులే కారణము లంక నాశనమునకున్ 

సహదేవుడు చెప్పారు...
శ్రీగురుభ్యోనమః
గురువుగారి మూత్రనాళాన అడ్డుపడిన రాళ్ళను ఆ పరమశివుని గాఢపు చూపులు మరియు ఢమరుక నాదరవళి ఖండించగ ప్రార్థిస్తూ :

దండమయా శివ! మ్రొక్కెద 
ఖండించగ నాళ రాళ్ళు గాఢపుదృక్కుల్,
డంఢమరుకనాదరవళి
డండడ డడడం డడండ డండడ డండమ్!

Tuesday 29 May 2012


సహదేవుడు చెప్పారు...
రాముని అరణ్యవాసమునకు పంపేసమయంలో అయోధ్య ప్రజలనూరడించుచూ రాజగురువుల పలుకులు: (క్రమాలంకారము)
సాకేతరాము నీవసు
ధైకప్రభువటంచుదెలియఁదరులన్బంపెన్,
శోకంబదేలశీఘ్రమె
కైకవిభుడు,రాఘవుండుకాపాడుమిమున్!

29 -5 -2012 నాటి సమస్యకు నా పూరణ

 పాల కడలి దేలు ఫణిశయనుని కన్న 
పద్మ నిలయుడైన బ్రహ్మ కన్న 
పుర్రెన భుజియించి బూడిద మైపూయు
ఫాల లోచ నుండు పాపి సుమ్ము!

సహదేవుడు గారూ, 
మీ పూరణ బాగుంది. అభినందనలు.

Thursday 24 May 2012


సహదేవుడు చెప్పారు...
కలిన కామప్రకోపాన కట్టుదప్పి
రంకునేర్చినచిన్నదిబొంకునేర్చు
కాలమహిమన తనవారికడుపునింప
రంకునేర్చినచిన్నదిబొంకలేదు

సహదేవుడు చెప్పారు...
పుత్రా! ప్రహ్లాదా! నను
చిత్రించుము నీమది,హరి సేవ వలదనన్
పిత్రా! శ్రీహరిఁ మఱచెడు
పుత్రుఁడ నేఁ గానటంచుపుత్రుఁడుపలికెన్!

సహదేవుడు చెప్పారు...
వేటగాడుకఱకుమోటుబోయ,కసాయి
పక్షిజంట జెదరబడసికరుణ
రామచరితమలచిరాణించె వాల్మీకి
మూర్ఖుడతడు,రాజపూజితుండు

సహదేవుడు చెప్పారు...
శంకరాభరణపుశంకరార్యులవారు
పద్యకవులపాటవంబు బెరుగ
సద్విమర్షజేయనద్వితీయముగను
తప్పులెన్నువాడెగొప్పవాడు
సహదేవుడు చెప్పారు...
అందెను సమరఫు వార్తలు
సుందరి దుఃఖించె మగడు శోభనమందే
తొందరజేయుచువెడలన్
పందిరిమంచమునముండ్లుపఱచుటె మేలౌ!

Sunday 20 May 2012


సుతుడు నలుపని చింతించే తండ్రిని,తాత(తండ్రికి తండ్రి) ఓదార్చు సందర్భంగా పలికిన పలుకులు:
పట్రా రా! యద్దము చూ
డట్రాచిక్కిన ముఖమ్ము!
యంతటివ్యధనీ
కట్రా!సుతుడి నలుపు బెం
గట్రా!చూలికిఁ తనయుడు కందర్పుడగున్!


సహదేవుడు చెప్పారు...
కొంటెవానినడుగఁగూర్చెనుగడులైదు
కొన్నిసంఖ్యలుంచెయన్నిగడుల
కనుబొమలెగరేసికలుపమన,గడులు
నాలుగైదుకలువనలువదయ్యె!


సహదేవుడు చెప్పారు...
సహదేవుడు చెప్పారు...
శనిదశలోనున్నానని
పనులన్నియుప్రక్క(బెట్ట
భావ్యమె?ధరణిన్
ఘనతరసాధనజేసిన
శనిపట్టినవారికగునుసకలశుభమ్ముల్

Wednesday 16 May 2012


సహదేవుడు చెప్పారు...
నేడు యాకలి దప్పిక నిద్ర లుడిగి
పరుగు లెత్తించు వ్యాజ్యాల బ్రతుకు లీడ్చ 
అలుపు నాకలి నిద్రాదు లలర, నట్టి 
పెన్నిధులు గల్గి సుఖియించు( బేద వా(డె

కంది శంకరయ్య చెప్పారు...
గుండా సహదేవుడు గారి పూరణ.....

పేదరికమున జనాభా
బాధల మూలము మనోజు బాణము గాదే?
యీ ధర స్థితి కారకుడౌ
మాధవు నకు శత్రువు గద మకర ధ్వజుడే!


కంది శంకరయ్య చెప్పారు...
గుండా సహదేవుడు గారి పూరణ.........

వర్తమానంలో జీవించడం రానివాళ్ళు నాకంలో వున్నా నరకంలో వున్నట్లే నన్న భావంతో వ్రాస్తున్నాను.

భూతభవితము లన్నవి భూతములయి
యెదను నిశ్చల పరచక బెదరగొట్టు
వర్తమానాన మనలేనివార లంత
నరకలోకము కలదండ్రు నాకమందు.

Sunday 13 May 2012

13-5-2012 నాటి సమస్యకు పూరణ

మనమలరించు  కథలతో 
సునిసిత "హాస్య",కళ" గలియ చూడవలయు తా
ధనమును పొదుపుగ వాడన్ 
సినిమాలను జూచు వాడు, శ్రీమంతుండగున్!
(క్రమాలంకారం)


Saturday 12 May 2012

12-5-2012 నాటి సమస్యకు నా పూరణ

రక్త నాళా ల తలపులె రగిలి పార
పోటుగామారిమనిషిని కాటు వేయు 
ధ్యాన మన్నది మనసు నోదార్చ, తగ్గు 
అధిక రక్త పోటు, సౌఖ్యమ్ము గూర్చు  

Friday 11 May 2012

11-5-2012 నాటి సమస్యకు నా పూరణ

పొందెను బొమ్మజేయగనుపుట్టిన వాణిని బ్రహ్మదేవుడున్! 
అందెను నల్లనయ్యతనె అష్టసతీగణగోపికాదులన్!
పొందెను మోహినిన్ శివుడు! మోహము నందు త్రిమూర్తులందరున్ 
అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందఱే! 




Thursday 10 May 2012

ఏడు స్వరములఝరు లేకమై యలరించు 
సప్త పదులు నడువ జంట కుదురు 
సప్త శిఖరి జేర స్వామిదర్శన మిచ్చు 
శంకరాభరణపు సప్త శతులు 
కవుల ఆర్తి దీర్చక నడక సాగించ
ఏడు వందలనిన ఎక్కువగున?

Tuesday 8 May 2012

8-5-2012 నాటి శంకరాభరణం లో ఇచ్చిన సమస్యకు నా పూర ణ

సీత నపహరించ దలచి సిద్ధమైన 
రావణాసురు,జంగమ   దేవర గని 
అట  పురోహితు డాప్తుడై అడ్డు జెప్ప 
నయ్య  వారిని గని నవ్వె యాచ  కుండు
బుద్ధి కర్మాను సారిణి పుడమి( గాదె ?