Wednesday 4 March 2015

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

పద్య రచన - 112 

 

ప్రతి వధువుకు వంకలు పెట్టే వరునికి, పెళ్ళి చేయటానికి,ఓ పెళ్ళిళ్ళ పేరయ్య వినూత్నమైన 'కన్య స్కోపు' తెచ్చి వరునికిచ్చి ఓ కన్యను చూడమనగ,అందులో ఒకే వధువు భిన్నవస్త్రధారణలతో కనిపించగా ఒప్పుకొని పెళ్ళాడాడన్నభావంతో:

పిల్లచక్కనైనఁ
బేరెట్టు వరునికి
'కన్య స్కోపుఁదెచ్చి గాంచ మనగ
పిల్లనొక్కతైనపెక్కురీతులఁజూపఁ
పిల్లనచ్చఁ గట్టె పెళ్ళిళ్లపేరయ్య?

Thursday 11 September 2014

భావించి విఘ్ననాథునిఁ
బావన భాద్రపదచవితిఁ బత్రియుఁ గుడుముల్
బ్రోవఁగ నిడి నైవేద్యం
బావల భుజియించుటే శుభావహ మందున్! (samasya)
రాగ మూలము స్వజనను రాగ మొకడె!
రోగ మూలము దుర్జన భోగ మొకడె!
ఆత్మ మూలము ధ్యానము నందుఁగనుటె
భోగ మూలము సజ్జన! త్యాగ మొకడె!(samasya)

పద్య రచన - 122


తల్లిదండ్రులెరుగనితరుణినేను
ముద్దుమురిపెమ్ముజూపగఁబొంగి పోయి
మనువు గాంధర్వమైననుమౌని నైతి
బేగి గొంపోవ నారాజ సాగి రమ్మ
నుచు శకుంతలలేఖలోనుడువ,చివర
నతివ కన్నీటి సంతక మతికె నంత

పద్య రచన - 121 

       

శిఖరమ్మునకొలువై,నీ
వఖిలమ్మునుగావ నీశ యంజలులివె! నీ
ముఖ మూలఁ భక్తి పారిన
సుఖమన్నదిగూడునంటశుభకర శూలీ!

 

 

 

అయ్యలు దోచెడు రాజ్యం
బయ్యెగ భారతమని మనమందున గల రా
మయ్యను దోచెదరని యా
దయ్యమ్మును గనిన హనుమ దారిని విడిచెన్! (samasya)