శ్రీ గణేశాయ నమః
సీ. సుధల చిలకరించు సుందర దరహాస
మెప్పుడు మోమున మెదలు చుండ
ధారణా శక్తితో తనవారి నందర
అధికారుల ఎదుట ఆదుకొనుచు
కరుణార్ద్ర హృదయాన శరణన్న వారికి
సమయోచితంబుగా సాయ మిచ్చి
రసహృద యుండన రాణించి సంగీత
సాహిత్య విషయాల సరస నుండ
తే.గీ. నేడిట పదోన్నతిని బొంది వెడలు చుండ
కళ్ళ యానంద భాష్పాలు కదలు చుండ
భావి జీవిత మంతయు చేవ నిచ్చి
ఆంజనేయ స్వామీ తమకు అండ నుండు!
No comments:
Post a Comment