Sunday 8 July 2012

   
సమస్యాపూరణం - 752 (గురుపత్నిని గోరువాఁడె)(3-7-2012)


 గురువేదైవంబని తా
    నిరతముసేవించివిద్యనేర్చెడువాడై
    సరిసేవ జేతు మీకని
    గురుపత్నినిఁగోరువాడు గుణవంతుడగున్.

*     *     *     *     *     *     *

    కురుసంగ్రామము జరిగినఁ
    జెఱు పని సుయోధనునకుఁ జెప్పుము తల్లీ!
    పరివారముఁ గావు మనుచు
    గురుపత్నినిఁ గోరువాడు గుణవంతుడగున్.

     (కురుపత్ని=భానుమతి)

No comments:

Post a Comment