Saturday 22 September 2012



శుక్రవారం 21 సెప్టెంబర్ 2012

సమస్యాపూరణం - 828 (నెలలో సుతుగన్న తల్లి)

కలగన్న చదువు ముగియగ
నిలలో గర్వించు రీతి నెత్తున కెదగన్
వెలలేని దీవెనల వె
న్నెలలో సుతుగన్న తల్లి నిగనిగ లాడెన్!

శుక్రవారం 21 సెప్టెంబర్ 2012

పద్య రచన - 119


భీమాంజనేయ ఘనులన్ 
                           స్వామీ సుతులుగ బడసిన సబలుండవు! యీ
భూమిన్ వర్షించ వరుణ
                         స్వామికి నేస్తునిగ రావె! సరయా   ! బ్రోవన్!’ 

వాయువు

గురువారం 20 సెప్టెంబర్ 2012

సమస్యాపూరణం - 827 (ధర్మపాలన కంటె)

రామరాజ్యాన ధర్మ విరామ మేది?

విశ్వమంతయునమ్మెడువిషయ మైన!

గర్భవతి సతి కంతటి కష్ట మేల?

ధర్మ పాలన కంటెఁ బాతకములేదు!

గురువారం 20 సెప్టెంబర్ 2012

పద్య రచన - 118

స్వల్పనీరము దొరకనియల్పులమయ!


నీరె జీవనా ధారంబు, నీదుకరుణ

వరుణ మాపై కురియజేసి వర్షమొసగు

సన్నుతింతుము నిను యాద సాంపతిగను!

బుధవారం 19 సెప్టెంబర్ 2012

సమస్యాపూరణం - 826 (విఘ్నపతికి మ్రొక్క)


గురువులందరి కారోగ్య వరములొసగి

బ్లాగు మిత్రులెల్లరకును బాగునిచ్చి

శంకరాభరణంబిట్లు సాగునట్లు

వేడెదను శంకరుని సుతు విఘ్ననాథు.

0..0..0..**-**..0..0..0

భక్తిభావముంచి పార్వతీ సుతుడైన

విఘ్నపతికి మ్రొక్క , విఘ్నములిడు

వార లెంద రెంత వారైన పారరె?

పరశు,పాశములకు దొరక కుండ! 

బుధవారం 19 సెప్టెంబర్ 2012

పద్య రచన - 117

మ్రొక్కెద మనస్సు నందున్

ముక్కంటి తనయు గిరిసుత ముద్దుల బిడ్డన్

మక్కువగా నుండ్రాళ్ళను

మ్రెక్కెడు బొజ్జగణపతిని మేటి చదువరిన్!

  

1 comment:

  1. PLEASE VISIT WWW.CPBROWN.ORG TO KNOW DETAILS ABOUT JAATEEYA STHAAYI PADYA POTEELU.

    ReplyDelete