Monday 10 September 2012













శనివారం 8 సెప్టెంబర్ 2012సమస్యాపూరణం - 816 (మమ్మీ డాడీలు తెలుఁగు)      





ఒక మనురాలు తాతయ్యతో అన్నట్లు:







సొమ్ములు కావలె నన్నను
బొమ్మా(గొమ్మా)యనిగుమ్మరింత్రుముద్దుగఁ(గోముగఁ) గానీ
కమ్మని వైనను నేర్పరు
మమ్మీడాడీలు,తెలుగుమాటలె తాతా!
శనివారం 8 సెప్టెంబర్ 201


పద్య రచన - 106

హేళనలులేనిహాస్యము
రేలంగికిజన్మతః భలే యభినయమై
కేరింతల గిలిగింతలు
తాళగలేనట్లుజేసి తప్పట్లొసగున్!

శుక్రవారం 7 సెప్టెంబర్ 2012


సమస్యాపూరణం - 815 (కోడ లున్నచోటు)

మామసంపదలవిమాయమైపోయినన్
యత్త మామ లెవరు?చెత్తనుచును
తల్లిగారి కలిమి తనదంచు గర్వించు
కోడలున్నచోటువీడునత్త!మామసంపదలవిమాయమైపోయినన్
యత్త మామ లెవరు?చెత్తనుచును
తల్లిగారి కలిమి తనదంచు గర్వించు
కోడలున్నచోటువీడునత్త
!

పద్య రచన - 104

గురువారం 6 సెప్టెంబర్ 2012



మండే సూర్యుని వరమున
గుండెల కుంపటి వలెగని కుంతీ కుమారై
ఎండకు వాగునఁ వదలన్,
కుండీలన్ జెత్త నేటి కుంతి కొమరుల్!

గురువారం 6 సెప్టెంబర్ 2012

సమస్యాపూరణం - 814 (యముఁ గని రోగార్తుఁడు
)



శమనగిరికరుగఁదప్పదు
శమనములేనట్టి ప్రాణసంకట మన్నన్
క్రమమగు ధన్వంతరి వై
ద్యముఁగని రోగార్తుడొక్కడానందించెన్!
సమస్యాపూరణం - 813 (బోధ సేయు గురుఁడు)
బ్రహ్మ విష్ణు శివుల ప్రత్యేక రూపమై
గౌరవంబు పొంది ఘనత చెంద
శిష్యు లైన వారి సిగరెట్లుకై పంపి
బోధ సేయు గురుఁడుమూర్ఖుడు కద 

మంగళవారం 4 సెప్టెంబర్ 2012


సమస్యాపూరణం - 812 (దున్నకు దూడ బుట్టినది)




ఎన్నికలింక వచ్చునని  యెందులకీ నస యెంచిజూడగన్
మిన్నగనేలవచ్చుగద మేమును మీరలు కూటమౌద మం
చన్నవి భాజపా మరియు హస్తము లన్న,నదిట్లుఁబోల్చరే
"దున్నకు దూడబుట్టినది దుగ్ధముఁబిండగ దుత్తదెమ్మికన్!"
నండూరి వారి యెంకీ!
నిండగుహృదయమ్ముఁబెంచె నీదగుసొగసున్!
బండిని లాగెడు లాస్యము
గుండెలఁగుచ్చదె?యనంగు గునపశరంబై!?

(మన్మధ శరములకే తట్టుకోలేకుంటె, శరములే గునపాలైనట్లు తపింప జేసె అందమన్న భావం)
కవ లన్నకు బుట్టినచో
భువిలో సుతులే యగుదురు పోలిక జూడన్
వివరముగ తమ్మనక,టుల
లవకుశులనువారుకవలు లక్ష్మణుని సుతుల్
తే.గీ.(సప్తపది)
వరద వృక్షాల పెకిలించి బురద జేయు
గఱిక తెలివిగ తలవంచి తిరిగి నిల్చు!
గరిక పాటివారెంతయో మెఱికె గనుక
పదము నిలుపక పద్యమ్ము పలుక నేర్చి
యెన్నియోయవధానాల వన్నె గూర్చ
గఱికపాటిసేయడుగదా గరిక పాటి!
యనుటయేపాటి నిజమగు నయ్య లార?
సుధలఁగురియు నవధానము!
కదనమనితలంచ వారు, కమ్మదనంబున్
ముదమునగ్రోలుట నెరుగని
వెధవాయిలనంగ నేను వెఱువను ధరణిన్!
కౌరవులపక్ష మందున కదన మందు
తమ్ముడైనను జంపగ తఱుమ నెంచ
సూత సుతుడర్జునుని, జంపి ఖ్యాతి గనెను
విజయుఁడా కృష్ణమూర్తియే విధముఁదెలుపఁ


శనివారం 1 సెప్టెంబర్ 2012

పద్య రచన - 99


దాన వీర శూరుండు రాధా సుతుండు
దుష్ట సాంగత్య మెంచగన్ దురితు డయ్యె
ధర్మ సంస్థాప నార్థము తప్పు గాదు
సంహ రించుమనియె పార్థ సారథి హరి
రూప భేద ముండుఁ గాని లోప మేది వారిలో
చూపుఁ జూడ సర్వ దైవ శోభితంబునిత్యమై
ఓపు గలిగి స్మరణ జేయు నొడుపుఁదెలియ నడ్డమై
పాపములకు,హేతువగును ప్రణవ మొకటె కాచగన్







శుక్రవారం 24 ఆగస్టు 2012
శుక్రవారం 31 ఆగస్టు 2012


పద్య రచన - 98



ఓంకారమేప్రణవమది
సంకరముగ సర్వదైవ సాకారంబున్
సంకీర్తనాళిఁ బాడగ
నో౦కారమునాదిను౦డి నుచ్చ్వాసంబౌ!

గురువారం 30 ఆగస్టు 2012


ఆగస్టు 31, 2012 11:03 ఉ 

సమస్యాపూరణం - 807 (నిద్ర చేకూర్చు సంపదల్)

ఆ త్రిమూర్తులే ధ్యానమ్ము నాచ రింప
మానసిక పురోగతులిచ్చి మనుజునకును
నిత్యసాధనా. సత్సంగ, నియమ యోగ
నిద్ర చేకూర్చుసంపదల్ భద్ర ముగను!
అన్య భాషల( విజ్ఞాన మంత నుండ
భాష లెన్నైన నేర్చిన( బండితునకు
మాతృ భాషాభి వృద్ధిని మఱచి, యేల
తెలుగు భాషాభిమానము తొలగ వలయు?
వానలు లేక సూర్య ప్రతాపము పెరిగిన సంధర్భంలో:

చెమరించె చందురునకున్!
దుమదుమలన్బెంచిసూరి దూకుడు రేగన్
కమలేశు కాకకు కమరు
కమలమునకు చంద్రుడే సుఖమ్మును గూర్చున్!
కలువ కన్నియ యొంటరై కొలనుఁజలక
మాడ, పున్నమి రేతిరి సడియె లేని
జాము లోన గ్రహాంతర సాస రందు
సొగసుఁగాంచగఁదిగిరేమొ సురలు ధరను!
కౌరవసేనలఁజూచి అర్జునునితోభయపడి తడబడి ఉత్తరుడన్నట్లు:

న..న...నరవరాయిటు నిలువ నాకుఁదరమె?
ను..ను...నుడువగ మాటేదియు నోట రాదె?
కాలు నిలువదు నీ..నీవె గాచు మనగఁ
న..న...న..నమ్ము నేనే గలననుచుఁబలికె!
కాల రధికుండుగానుండి కడలిఁ గ్రుంగ
పమయమాసన్నమైనయస్తమయమనెడి
సత్తెమునుదెలుపుసందేశ చిత్తరువున
సూర్యనారాయణుండెంతసోయగాడు!
పంచచామర వృత్తము:
నిశాచరాదులన్ వధించ నీరజాక్షుడీ మహిన్
దశావ తారముల్ ధరించె , త్ర్యంబకుండుదారుడై
యశంబునొందె సాయమిచ్చి యద్భుతాంశ ధారుడై
దశావతారకాలమందుఁ ధర్మ రక్షణంబుకై!
కన్ను మిన్ను గనక గనులన్ని దోచుచుఁ
న్యాయదేవతఁగొను నైచ్యుడయ్యు
కర్త కర్మ క్రియల కారణుండిట్లను
"కల్కి వచ్చు ననుట కల్ల సుమ్ము!"
గ్రహములనుజేరురోవర్లుఘనతఁజెందఁ!
యశ్వ వాహన మేపాటి?యదుకులేశ!
బాంబు లేవైనఁజొరలేని పటిమ నంద!
చేతి కరవాల మేరీతి చిత్తు జేయు?
నీ దశావతారంబును నిక్కముగను
టెన్తు జనరేష నున్మీఱు టెక్కుఁగూర్చి
ఆధునికముగ జన్మించు మాది  విష్ణు!
వందన శతమ్ములర్పింతు వంగి వంగి
కల్కియవతార మర్జంటు కలి తరించ!


ఉన్నతాసనాధీశుడైయుండి కూడ
మనుష మాంసమ్ము మరిగిన దనుజుడగుచు
ఇడియమీను, యుగాండాను జడిపెడు ప్ర
బుద్ధుఁడాతఁడుహింసానిబద్ధుఁడెపుడు!
జీవపరిణామ సిద్ధాంత చిత్రములను
విష్ణు దశరూప సరళియే విశద పఱచు
 లౌకికాలౌకికమ్మగు రక్తి దెలిసి
భువిని కోరికల్వీడియున్ బుద్ధుడయ్యె!
చక్రి శశియభిమన్యుల జంట మెచ్చి
యన్న గారినొప్పింపగ నదను జూచి
గొప్పవాడభియనిజెప్పెఁ గూడి సత్య
భామ, రుక్మిణిసతి, బలరామునకును












తమ కడుపు నిండఁ దామే
శ్రమించి పండించుడనెడు సారముఁ దెలుపన్
కమలాక్షుడు హల ధారిగఁ
శ్రమైక జీవన మనునది సౌందర్యమనెన్!
వంశ పరంపర లీ

యవనీతలమందెఱుంగు నాది కవి కడన్
లవకుశుల చదువు సాగన్
దివిజ వరుల మెప్పు పొందుతేజరులవరే!

రవివంశ పరంపర లీ
యవనీతలమందెఱుంగు నాది కవి కడన్
లవకుశుల చదువు సాగన్
దివిజ వరుల మెప్పు పొందుతేజరులవరే!

రవివంశ పరంపర లీ
యవనీతలమందెఱుంగు నాది కవి కడన్
లవకుశుల చదువు సాగన్
దివిజ వరుల మెప్పు పొందుతేజరులవరే!
ప్రేమగఁదీవిని దివిగాఁ
దా మలచగ రావణునకు ,తన్మయులగుచున్
స్వామీ యనంగ,రిపులై
రామునకున్, భక్తులుగద రాక్షసులెల్లన్!


No comments:

Post a Comment